
జిల్లాలో 5 పురపాలికలు.. 31 ఖాళీలు
పన్ను వసూళ్లలో ఇక్కట్లు..
● గ్రామపాలన అధికారుల
నియామకంతోనే..
● ఉన్న వారిపై అదనపు పనిభారం
● పన్ను వసూళ్లు, ప్రభుత్వ కార్యక్రమాల అమలుతో సతమతమవుతున్న వైనం
●
అమరచింత: బీఆర్‌ఎస్ పాలనలో రెవెన్యూశాఖలో ధరణిని అందుబాటులోకి తీసుకొచ్చి వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి వారినివివిధ విభాగాల్లో భర్తీ చేశారు. చాలామందిని పురపాలికల్లో వార్డు అధికారులుగా నియమించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి భూ భారతిని తీసుకొచ్చి గ్రామపాలన అధికారులను నియమించింది. ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగం చేస్తున్న వీఆర్వోలకు తాజాగా ఎంపిక పరీక్ష నిర్వహించి తిరిగి గ్రామపాలన అధికారులుగా గ్రామాలకు కేటాయించడం, నియామక పత్రాలు అందించడంతో వారంతా ఆయా గ్రామాలకు వెళ్లిపోయారు. దీంతో పురపాలికల్లో వార్డు ఆఫీసర్ల ఖాళీలు ఏర్పడ్డాయి. అలాగే గతంలో గ్రూప్–4 ద్వారా నియామకమైన వార్డు అధికారుల్లో కొందరు నేటికీ విధుల్లో చేరకపోవడం, ఉద్యోగంలో చేరిన వారు దీర్ఘకాలిక సెలవులు, డిప్యుటేషన్‌పై వెళ్లడంతో పురపాలికల్లో నిర్వహణ భారంగా మారుతోంది. ఆస్తి పన్ను వసూళ్లు, ప్రభుత్వ కార్యక్రమాల అమలుతో పాటు స్వచ్ఛ కార్యక్రమాలను పుర కమిషనర్లే ముందుండి సిబ్బందితో చేయిస్తున్నారు.
సమస్యల గుర్తింపులో ఇబ్బందులు..
వార్డు అధికారులు లేక ఆయా కాలనీల్లో సమస్యలు గుర్తించడంతో పాటు పరిష్కారానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, మురుగు కాల్వల శుభ్రతతో పాటు ఇంటి నిర్మాణాల అనుమతులు తదితర విషయాలను వార్డు అధికారుల ద్వారా తెలుసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం కాలనీవాసులే నేరుగా పుర కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తేనే తెలుస్తోందని పుర ఉద్యోగులు వెల్లడిస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై రోజువారి నివేదిక అందించే బాధ్యతను జిల్లా అధికారులు వార్డు ఆఫీసర్లకే కేటాయించడంతో జిల్లా లబ్ధిదారుల ఇళ్ల చుట్టే తిరగడానికే కాలం గడిచిపోతుందని.. మిగిలిన పనులు ఎలా పూర్తి చేయాలని వార్డు అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించడం, హౌసింగ్ సూపర్‌వైజర్లకు సహకరించడం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించడం వంటి పనులతో సతమతమవుతున్నారు.
పురపాలికల వారీగా ఖాళీలు ఇలా..
వార్డు ఆఫీసర్ల కొరతతో ఇంటి, కొళాయి పన్ను వసూళ్లలో జాప్యం జరుగుతోంది. ఇంతవరకు వార్డు అధికారులు పుర కార్మికులను వెంట బెట్టుకొని ఇల్లిల్లూ తిరిగి పన్ను వసూళ్లు చేపట్టేవారు. ప్రస్తుతం ఉన్న అధికారులకు ఒక్కొక్కరికి రెండు వార్డులు కేటాయించి పన్ను వసూళ్లతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ బాధ్యత అప్పగించడంతో పనిభారం అధికమై సతమతమవుతున్నారు.

జిల్లాలో 5 పురపాలికలు.. 31 ఖాళీలు

జిల్లాలో 5 పురపాలికలు.. 31 ఖాళీలు

జిల్లాలో 5 పురపాలికలు.. 31 ఖాళీలు