
ఫుట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక
వనపర్తి రూరల్: జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం పెబ్బేరు పీజేపీ క్యాంపు మైదానంలో సీనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించినట్లు కోచ్ నాగరాజు తెలిపారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి 45 మంది క్రీడాకారులు హాజరుకాగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఎంపికల్లో నైపుణ్యం కనబర్చిన వారిని క్యాంపునకు ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ నెల 21 నుంచి క్యాంపు కొనసాగుతుందన్నారు. ఎంపికల్లో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణకుమార్‌రెడ్డి, నందిమళ్ల తిరుప తి, కోశాధికారి అఫ్సర్, ఉపాధ్యక్షులు సురేందర్‌రెడ్డి, పీడీ రాజేందర్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.
రేషన్ డీలర్ల
ఖాళీలు భర్తీ చేయాలి
వనపర్తి రూరల్: జిల్లాలో రేషన్ డీలర్ల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను సక్రమంగా నిర్వర్తించాలని గురువారం బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ కలెక్టరేట్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా వివిధ కారణాలతో అనేకమంది రేషన్ డీలర్లను తొలగించారని, మరికొందరు 6ఏ కేసులు నమోదై సస్పెన్షన్‌లో ఉన్నారని చెప్పారు. రేషన్ దుకాణాల డీలర్లు అందుబాటులో ఉండి ప్రజలకు నిత్యావసర సరుకులు అందించాల్సి ఉండగా.. ఇతరులు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. బాధ్యతలో మెలగాల్సిన పలువురు డీలర్లు తప్పుడు మార్గంలో పయనిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో వివిధ మండలాల అధ్యక్షులు దేవర శివ, అంజన్నయాదవ్, మహేందర్‌నాయుడు, నాగరాజు, యశ్వంత్, రాములు, రంగన్న, నర్సింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీబీ సీఈఓ నియామకం నిలిపివేత
సాక్షి, నాగర్‌కర్నూల్/ మహబూబ్‌నగర్ (వ్యవసాయం): మహబూబ్‌నగర్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ సీఈఓ నియామకాన్ని నిలిపివేస్తూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. సీఈఓ నియామకానికి అవసరమైన నిబంధనలు పాటించకపోవడంతో ఆయన నియామకాన్ని నిరాకరించినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ డీసీసీబీ సీఈఓగా డి.పురుషోత్తమరావును ఈ ఏడాది జూలై 14న నియమించాలని కోరుతూ కమిటీ పంపిన ప్రతిపాదనను ఆర్బీఐ తిరస్కరిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. దీనిపై మహబూబ్‌నగర్ డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి స్పందిస్తూ సీఈఓ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనను మాత్రమే ఆర్బీఐ తిరస్కరించిందని, నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని పేర్కొన్నారు.

ఫుట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక