
తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి గజవాహన సేవ వైభవోపేతంగా నిర్వహించారు. కురుమతిరాయుడిని గజవాహనంపై ఆశీనులుగావించి స్వామివారి ఆలయం నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు ప్రధాన మెట్ల గుండా ఊరేగించారు. స్వామివారిని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కురుమూర్తివాస గోవిందా.. గోవిందా అంటూ నామస్మరణ చేశారు. కార్యక్రమంలో చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఈఓ మధనేశ్వర్‌రెడ్డి, భాస్కర్, కృష్ణయ్య, విష్ణుచారి తదితరులు పాల్గొన్నారు.