విజయనగరం రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురుదెబ్బతగిలింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న రాజ్యాంగ నిబంధనను కాదని, బీసీలకు 34 శాతం సీట్లు ఇస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడిన నాటకాన్ని అత్యున్నత న్యాయస్థానం బట్టబయలు చేసింది. 50 శాతం పరిమితిని దాటేందుకు వీలులేదని తీర్పులో వెలువరించింది. సత్వరమే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడంతో ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సమాయత్తమైంది. ఈ క్రమంలో మొత్తం 8 కేటగిరీలుగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. దీనికి సంబంధించిన జీఓ విడుదల కావాల్సి ఉంది.
ఎన్నికల నిర్వహణ ఇలా..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం కీలక వివరాలు వెల్లడించింది. గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించేందుకు పరిశీలిస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలు, నోటిఫికేషన్ వెలువడిన 14 రోజుల్లోనే నిర్వహించి, అదేరోజు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నోటిఫికేషన్ జారీ చేసిన 16 రోజుల్లో నిర్వహించి రెండు రోజులు అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు.
çÜ${ï³…-MøÆý‡$t E™èl¢-Æý‡$Ó-ÌS™ø Ð]l*ǯ]l ˘
సమీకరణాలు
రిజర్వేషన్లు ఖరారు చేసినా జీఓ జారీ చేయని చంద్రబాబు సర్కారు
ఏ క్షణమైనా జీఓ జారీ అయ్యే అవకాశం
జిల్లాలో రాజకీయ వేడి
స్థానిక పోరులో చంద్రబాబు సర్కార్‌కు నిరసన సెగ!
న్యాయస్థానాల ఉత్తర్వులతో ఎన్నికల నగారా మోగడంతో విజయనగరం జిల్లా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీసీ రిజర్వేషన్ల కోతపై క్షేత్రస్థాయిలో ప్రజలకు సమాధా నం చెప్పుకోలేక అధికార కూటమి నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, రిజర్వేషన్ల విషయంలో నాటకాలాడుతున్న కూటమి ప్రభుత్వానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి విజయనగరం జిల్లా ఓటర్లు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో ఓటర్ల వివరాలు ఇలా..
పాత ఓటర్ల జాబితా ప్రకారం.. జిల్లాలో 12,85,691 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 6,35,994 మంది, మహిళలు 6,59,660 మంది కాగా ఇతరులు 37 మంది ఉన్నారు. వీరిలో బీసీ ఓటర్లు 10,38,667 మంది , ఎస్సీ ఓటర్లు 1,33,033 మంది, ఎస్టీ ఓటర్లు 30,593 మంది ఉన్నారు. ఇతర కులాలకు చెందిన వారు 83,398 మంది నమోదై ఉన్నారు. పంచాయతీలకు సంబంధించి 7,398, ఎంపీటీసీలకు 1586 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.


