● సర్వజన ఆస్పత్రిలో నిలిచిన
టూడిఈకో సేవలు
● ఇబ్బందిపడుతున్న రోగులు
● చోద్యం చూస్తున్న అధికారులు
విజయనగరం ఫోర్ట్:
వీరిద్దరే కాదు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వైద్యకోసం వచ్చిన చాలామంది రోగులకు గత ఐదురోజులుగా టూడిఈకో స్కాన్ కష్టాలు తప్పడంలేదు. బీపీ, ఈసీజీలో తేడా ఉన్నవారికి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారికి గుండె సమస్యలు గుర్తించేందుకు టూడీఈకో స్కాన్ చేస్తారు. ఈ నివేదికను చూసి వైద్యులు సరైన మందులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే, సర్వజన ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న టూడిఈకో టెక్నీషియన్లు ముగ్గురు సమ్మెలో ఉన్నారు. అత్యవసర విభాగంలో పనిచేసే టెక్నీషియన్లు సమ్మెకు వెళ్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు మిన్నకుండడంతో రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. గుండె సంబంధిత రోగులకు సకాలంలో వైద్యసేవలందకపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉందంటూ బంధువులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాకే పెద్దాస్పత్రిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై మండిపడుతున్నారు.
సమ్మెలో ఉండడం వల్లే..
టూడిఈకో టెక్నీషయన్లు సమ్మెలో ఉన్నారు. అందువల్ల టూడిఈకో తీయలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తాం.
– డాక్టర్ అల్లు పద్మజ,
సూపరింటెండెంట్,
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి


