విజయనగరం టౌన్: కుటుంబ సమేతంగా చూడవలసిన చిత్రం ‘చకోర’ అని చిత్ర హీరో శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన చకోర చిత్ర యూనిట్ శనివారం విజయనగరంలో సందడి చేసింది. సీఎంఆర్ కూడలి నుంచి ఎన్‌సీఎస్ థియేటర్ వరకూ ఓపెన్ టాప్ కార్‌లో ఊరేగింపుగా వచ్చారు. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ సొంత జిల్లాలో తనకు ఎనలేని ఆదరణ లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. సినిమా బాగా వచ్చిందని, యువత ఎ క్కువగా ఆదరిస్తున్నారన్నారు. యూత్‌పుల్ లవ్‌స్టోరీలో ట్రూలవ్ కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. తొలి చిత్రాన్ని చేయడానికి కారణమైన తన తల్లి లక్ష్మి, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి ఆయన సినిమా వీక్షించారు.


