న్యూస్‌రీల్
మహిళలపై ఏబీఎన్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాఖ్యలు దారుణం మీడియా స్వేచ్ఛ పేరుతో మహిళలను కించపరచడమా...? ఆగ్రహం వ్యక్తంచేసిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు డీఎస్పీ కార్యాలయం వరకు వైఎస్సార్‌సీపీ శ్రేణుల నిరసన ర్యాలీ
విజయనగరం
శుక్రవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
గరివిడి మండలం కొండపాలెం హడ్కో కాలనీ సమీపంలో విద్యుత్ వైర్లు తెగిపడిన ఘటనలో ఏడు మేకలు మృతి చెందాయి.
వలసల నివారణకు ప్రవేశ పెట్టిన ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారుతోంది. వేతనదారులకు నిర్దేశిత పనిదినాలు లభించడం లేదు.
రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్సార్‌సీపీదే గెలుపని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు తీరుపై సాక్ష్యాత్తు సీఎం అసంతృప్తి వ్యక్తంచేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికై నా ఉత్తరాంధ్రలో ఉన్న కూటమి నేతలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.బంగారునాయుడు, మాజీ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టివీరవెంకట రాజేశ్వరరావు, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, జిల్లా యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్ కౌశిక్, తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం:
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా నిరంతరం శ్రమి స్తున్న వైఎస్సార్‌సీపీ మహిళలను కించపరిచేలా వాఖ్యలు చేసిన ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరంగా శిక్ష అనుభవించక తప్పదని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు హెచ్చరించా రు. మహిళలను కించపరిచేలా చేసిన వాఖ్యలను వెనక్కితీసుకుని క్షమాపణ చేప్పాలన్నారు. మీడి యా స్వేచ్ఛ పేరుతో మహిళలను కించపరచడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గూడ్స్‌షెడ్ రోడ్డులోని క్లాక్‌టవర్ నుంచి విజయనగరం డివిజనల్ పోలీస్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో కలిసి నల్ల కండువాలతో గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. తక్షణమే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎస్పీ గోవిందరావుకు వినతిపత్రం అందజేశారు.
జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు మహిళలంటే ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. దురుద్దేశంతో వైఎస్సార్‌సీపీ మహిళా నాయకులను కించపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ని 175 నియోకజకవర్గ కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్ల లో ఫిర్యాదు చేశామన్నారు. అధికారం శాశ్వతం కాదని, ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రజలకు దూరమైందని చెప్పారు. మహిళలపట్ల అనుచిత వ్యాఖ్యలతో ప్రచారాలు చేసే పత్రికా సంస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ వత్తాసు పలకడం విచారకరమన్నారు. మహిళల పట్ల చంద్రబాబు ప్రభుత్వ చిత్తశుద్ధి తేటతెల్లం అయ్యిందన్నారు.
రాష్ట్ర ప్రయోజనలే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మావిగన్ పేరు ప్రతిపాది స్తే, కూటిమి ప్రభుత్వ పెద్దలకు ఎందుకంత ఆగ్రహ మని మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నించారు. రాష్ట్రంలోని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులు కలిపి ఎకనామిక్ కారిడర్‌గా అభివృద్ధి చేసుందుకు రూ. 20 కోట్లు పెట్టుబడులు సరిపోతాయని, తద్వారా రాజధానికి అభివృద్ధి చెందుతుందన్నారు. కేవలం జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ పట్ల ద్వేషంతో మావిగన్ ప్రతిపాదనను వ్యతిరేకించడం దారుణమన్నారు.
డీఆర్‌డీఏ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులు ప్రగతిని వివరించగా, పావలా వడ్డీ పథకం మహిళలకు అందుతుందా అని జెడ్పీ చైర్మన్ అధికారులను అడిగారు. అటువంటి పథకం ఏదీ అమలు కావడం లేదని, మహిళా సభ్యులే తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించాల్సిందేనని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో పావలా వడ్డీ పథకాన్ని అటకెక్కించారని సభ్యులు మండిపడ్డారు.


