● ఉపాధిలో సమయపాలన పాటించేలా చూడాలి
● ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి
● డ్వామా పీడీ రామచంద్రరావు
సీతానగరం: ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రాంతాల్లో సాంకేతిక సహాయకులు తరచూ క్షేత్ర స్థాయిలో సందర్శించాలని, వేతనదారులు చేస్తున్న పనులు పరిశీలించి నివేదికలు తయారు చేయాలని డ్వామా పీడీ కె.రామచంద్రరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఎంఎల్‌ఎన్ ప్రసాద్ అధ్యక్షతన ఉపాధి హామీ అధికార సిబ్బందితో ఉపాధి పనుల నిర్వహణపై గురువారం సమీక్షించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్నందున వేతనదారులు వడదెబ్బకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. పని ప్రదేశాల వద్ద సదుపాయాల నిమిత్తం సంబంధత ఏఎన్‌ఎం నుంచి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు తీసుకుని పని వద్ద ఉంచాలన్నారు. ఎన్‌ఎంఎంఎస్ పంపించే సమయంలో వచ్చే సమస్యలను పరిష్కరించడానికి ఏపీపీలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకంలో ఉత్పన్నమైన సమస్యలను దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఏపీఓ ఊణ్ణ బాలకృష్ణ, జేఈ సోమేశ్వరరావు, సాంకేతిక సహాయకులు పాల్గొన్నారు.


