● కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి
వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరికీ పాస్ పుస్తకాలు అందేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్‌ఓ సీహెచ్ సత్తిబాబు, కేఆర్‌సీ ఎస్డీసీ ఈ.మురళి పాల్గొన్నారు.
మెరుగైన ర్యాంకులు సాధించాలి
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జిల్లాకు చెందిన మున్సిపాలిటీలు మెరుగైన ర్యాంకులు సాధించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. దేశవ్యాప్తంగా టాప్–100లో స్థానం దక్కేలా ప్రత్యేకంగా విజయనగరం, బొబ్బిలి మున్సిపాలిటీల కృషి చేయాలని దిశానిర్ధేశం చేశారు. ఇతర మున్సిపాలిటీలు కూడా తమ ర్యాంకులను మెరుగుపర్చుకోవాలని సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, అన్న క్యాంటీన్లు, పన్నుల వసూళ్లు, ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్, తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో విజయనగరం, బొబ్బిలి, రాజాం, నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ ఈఈ, తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం అర్బన్: జిల్లాలో రెవెన్యూ సంబంధిత సేవలు, భూసర్వే ప్రక్రియ, ప్రజల అర్జీల పరిష్కారంలో అధికారులు మరింత వేగంగా స్పందించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులతో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన మ్యుటేషన్లలో ఐదు రకాల సవరణలను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వాస్తవ స్థితిగతుల ఆధారంగా కరెక్షన్స్ చేయాలని స్పష్టం చేశారు. మార్చి 31 నాటికి జిల్లాలో అందిన 22ఏ దరఖాస్తులపై సమీక్ష నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఫారం–8 జారీని రెండు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఐవీఆర్‌ఎస్ సర్వేపై కూడా సమీక్ష నిర్వహించిన కలెక్టర్, ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా సేవలు అందించాలన్నారు. అన్ని సేవలపైనా 90 శాతం కంటే ఎక్కువ సంతృప్తి స్థాయిని సాధించేలా పనితీరు ఉండాలని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ మాట్లాడుతూ.. వెబ్‌ల్యాండ్ పోర్టింగ్ పనులు గడువులోగా పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ముఖ్యంగా ఫేజ్–4 పరిధిలోని 126 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియ 96,779.71 ఎకరాల వరకు పూర్తయిందని.. మిగిలిన పనులు


