12వ పీఆర్‌సీ ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

12వ పీఆర్‌సీ ఏర్పాటు చేయాలి

Apr 2 2026 9:04 AM | Updated on Apr 2 2026 9:04 AM

విజయనగరం అర్బన్‌: ఉపాధ్యాయుల ఆర్థిక డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) జిల్లా శాఖ బుధవారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట నిరాహార దీక్ష శిబిరం నిర్వహించింది. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. 12వ పీఆర్‌సీ కమిషన్‌ చైర్మన్‌ను వెంటనే నియమించాలని.. అంతవరకు 29 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏలను మంజూరు చేయాలని, హెల్త్‌ కార్డులను అన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు ఆమోదించేలా అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు బకాయిలను వెంటనే చెల్లించాలని.. జీఓ 57 అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ అమలు చేయాలని కోరారు. యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, అధ్యక్షుడు సీహెచ్‌ భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో రాష్ట్ర కార్యదర్శి మురళీమోహన్‌, సీనియర్‌ నాయకులు కె.విజయగౌరి, డి.రాము, సహాధ్యక్షురాలు జి.పార్వతి, కోశాధికారి సీహెచ్‌ తిరుపతినాయుడు, రాష్ట్ర ఆడిట్‌ కమిటీ సభ్యుడు రమేష్‌ చంద్రపట్నాయక్‌, ఈశ్వరరావు, కె..శ్రీదేవి, ఎన్‌.సత్యనారాయణ, ఎస్‌.వెంకటరావు, కిల్లాడ అప్పారావు, గంట సుశీల, నిర్మల, శశికళతో పాటు మండల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement