ఖైదీల పట్ల వివక్ష తగదు | - | Sakshi
Sakshi News home page

ఖైదీల పట్ల వివక్ష తగదు

Apr 1 2026 8:30 AM | Updated on Apr 1 2026 8:30 AM

చీపురుపల్లి: సబ్‌ జైళ్లలో ఉన్న ఖైదీలు పట్ల వివక్ష చూపితే కఠిన చర్యలు తప్పవని నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి బి.అప్పలస్వామి అన్నారు. పట్టణంలోని సబ్‌ జైల్‌ను మంగళవారం బోర్డు ఆఫ్‌ విజిటర్స్‌ ఫర్‌ ప్రిజనర్స్‌ బృందం పరిశీలనకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ మేరకు ప్రభుత్వం బోర్డ్‌ ఆఫ్‌ విజిటర్స్‌ ఫర్‌ ప్రిజనేర్స్‌ ఏర్పాటు చేసిందన్నారు. కారాగారంలో ఉన్న ఖైదీలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీలు నేర ప్రవత్తిని విడిచి మంచి పౌరులుగా తయారు కావాలన్నారు. సబ్‌జైల్లో కొనసాగుతున్న జైల్‌ లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లను తనిఖీ చేశారు. జైలులో అమలవుతున్న సౌకర్యాలు గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. వంటగది, భోజనశాలను పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌ సందర్శించి వంట సరుకులను పప్పు దినుసులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్‌, జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ అన్నపూర్ణమ్మ, చీపురుపల్లి ఆర్‌డీఓ ఎం.సుధారాణి, డీఎస్పీ ఎస్‌.రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement