వేడుకగా ఊంజల్‌ సేవ | - | Sakshi
Sakshi News home page

వేడుకగా ఊంజల్‌ సేవ

Mar 30 2026 7:17 AM | Updated on Mar 30 2026 7:17 AM

వేడుకగా ఊంజల్‌ సేవ నేడు జెడ్పీలో పీ–4 వార్షికోత్సవం

విజయనగరం రూరల్‌: శ్రీరామ వసంత నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం రామనారాయణంలో సీతారాముల దేవతామూర్తులకు సోమవారం ఊంజల్‌ సేవ వేడుకలా నిర్వహించారు. అర్చకులు, ఎన్‌సీఎస్‌ ట్రస్టీలు నారాయణం నాగేశ్వరరావు, సీతారామయ్య, శ్రీనివాస్‌లు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, శ్రీరామచంద్రునికి ప్రత్యేక పూజలు చేశారు. ఇవటూరి మెహెర్గత ఆలపించిన అన్నమయ్య కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

విజయనగరం రూరల్‌: విజయనగరం నియోజకవర్గం జీరో పోవర్టీ పీ – 4 వార్షికోత్సవం సోమవారం నిర్వహించనున్నట్టు జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో పీ – 4 కార్య క్రమ ప్రగతి, విజయాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement