ఎన్నికల కమిషన్‌ పాత్రపై పుస్తకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల కమిషన్‌ పాత్రపై పుస్తకావిష్కరణ

Mar 27 2026 9:49 AM | Updated on Mar 27 2026 9:49 AM

విజయనగరం అర్బన్‌: జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ వెన్నపూస బ్రహ్మారెడ్డి రచించిన ‘ఎన్నికల కమిషన్‌ పనితీరు– ప్రజాస్వామ్య బలోపేతం’ అనే పస్తకాన్ని వైఎస్సార్‌సీపీ శాసన మండలి సభ్యులు గురువారం ఆవిష్కరించారు. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణను పరామర్శించేందుకు విజయనగరం వచ్చిన శాసన మండలి అస్యూరెన్స్‌ కమిటీ చైర్మన్‌ రంజిత్‌ బాషాతో పాటు ఎమ్మెల్సీలు విక్రాంత్‌ బాబు, టి.రామచంద్రరెడ్డి, డాక్టర్‌ పి.సూర్యనారాయణరాజు (సురేష్‌బాబు) చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞానవేదిక జాతీ య అధ్యక్షుడు డాక్టర్‌ ఎంవీఆర్‌ కృష్ణాజీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను బలో పేతం చేయడంలో ఎన్నికల కమిషన్‌ కీలకపాత్ర పోషిస్తుందని, ఆ దిశగా విశ్లేషణాత్మకంగా రచయిత వివరించినట్టు తెలిపారు.

పోలమాంబ హుండీల ఆదాయం రూ.9.90లక్షలు

మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి ఆలయ హుండీల ఆదాయాన్ని ఈఓ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గురువారం లెక్కించారు. ఈ ఏడాది 7, 8, 9వ జాతరకు వచ్చిన భక్తులు చదురుగుడి, వనంగుడిలోని హుండీలలో వేసిన కానుకల రూపంలో రూ. 9,90,256 ఆదాయం వచ్చింది. బంగారం 4 గ్రాములు, వెండి 13 గ్రాములు సమకూరినట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా దేవదాయశాఖ అధికారి ఎస్‌.రాజారావు, ఆలయ చైర్మన్‌ నైదాన చినతిరుపతి, సర్పంచ్‌ వి.సింహాచలమమ్మ, ఉప సర్పంచ్‌ అల్లు వెంకటరమణ, కమిటీ సభ్యులు, మాజీ చైర్మన్లు, శ్రీవారి సేవకులు, గ్రామపెద్దలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement