నేడు హైకోర్టు న్యాయమూర్తుల రాక | - | Sakshi
Sakshi News home page

నేడు హైకోర్టు న్యాయమూర్తుల రాక

Mar 22 2026 2:08 AM | Updated on Mar 22 2026 2:08 AM

శృంగవరపుకోట: పట్టణంలో ఆదివారం ఉద యం 9.30 గంటలకు జరగనున్న కోర్టు కాంప్లెక్స్‌ భవనం భూమి పూజకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు తర్లాడ రాజశేఖరరావు, చీకటి మాన వేంద్రనాథ్‌రాయ్‌లు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నట్టు ఎస్‌.కోట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోగాడ సూరిదేముడు చెప్పారు. ఏర్పాట్లను ఆర్డీఓ డి.వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌ శ్రీనివాసరావుతో కలిసి శనివారం పరిశీలించారు.

ఎన్‌సీసీ కేడెట్‌లకు ఎస్పీ అభినందనలు

విజయనగరం క్రైమ్‌: ఎన్‌సీసీ (నేషన కేడిట్స్‌ కార్ప్స్‌) కేడెట్‌లను ఎస్పీ దామోదర్‌ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శనివారం అభినందించారు. మహాశివరాత్రి రోజున రామతీర్థం ఆలయంలో కేడెట్‌లు విశేష సేవలందించడం అభినందనీయమన్నారు. క్రమశిక్షణగా ఉండాలని, ఉన్నతమైన భవిష్యత్తుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించా రు. సమాజానికి సేవలందిస్తూ ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. భారతదేశం అనేక భాషలు, సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనమని, భిన్నమతాలు, కులాలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులమనే భావనను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు లీలారావు, జి.రామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement