సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వసంతోత్సవాల్లో భాగంగా శనివారం లక్ష తులసీదళార్చనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేకువజామున ప్రాతఃకాలార్చన పూజలనంతరం వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 40 మంది వేద పండితులు శ్రీమద్రామాయణ పారాయణం, సుందరాకాండ పారాయణం, దివ్య ప్రబంధ సేవా కాలములు జరిపించారు. అనంతరం స్వామి సన్నిధిలో లక్ష తులసీదళార్చన, లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ నెల 27 వరకు లక్ష తులసీ, కుంకుమార్చనలు కొనసాగుతాయని అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
– నెల్లిమర్ల రూరల్


