● జిల్లా వేదికగా రెండు రోజులు రాష్ట్ర స్థాయి పోటీలు
విజయనగరం: క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన టెన్నీస్ లీగ్ పోటీలకు విజయనగరం వేదిక కానుంది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో విజ్జి స్టేడియంలో టెన్నీస్ క్రీడాంశంలో రెండు రోజుల పాటు జరిగే పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారు. మాస్టర్స్ విభాగంలో నిర్వహించే పోటీలను ఆదివారం ఉదయం విజయనగరం ఎమ్మెల్యే అదితిగజపతిరాజు, కలెక్టర్ ఎం.రామసుందర్‌రెడ్డి ప్రారంభించనున్నారు. 45 ప్లస్ విభాగంలో నిర్వహించే పోటీల్లో 60 మంది క్రీడాకారులు సింగిల్స్, డబుల్స్ విభాగా ల్లో తలపడనున్నారు. పోటీలకు హాజరైన క్రీడాకారులు భోజన, వసతి సదుపాయాలు కల్పించనున్నట్టు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సోమవారం బహుమతులు ప్రదానం చేయనున్నట్టు పేర్కొన్నారు.


