జామి ఎల్లారమ్మ జాతర ముహూర్తం ఖరారు
● ఫిబ్రవరి 23 నుంచి 25 వరకు జాతర
జామి: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన జామి ఎల్లారమ్మ జాతర ముహూర్తం ఖరారైంది. స్థానిక శివాలయంలో ఎండోమెంట్ మరియు గ్రామపెద్దల ఆధ్వర్యంలో వేదపండితులు ఎం.భానుమూర్తి నేతృత్వంలో ఫిబ్రవరి 23, 24, 25 తేదీల్లో జరపడానికి ఆదివారం ముహూర్తం ఖరారు చేశారు. 23వ తేదీన తొలేళ్లు ఉత్సవం సందర్భంగా అమ్మవారిని గద్దె నుంచి 9.15 నుంచి 9.25 మధ్య తీసుకురావడానికి ముహూర్తం నిర్ణయించారు. తెల్లవారుజామున 2 నుంచి 3.30 గంటల మధ్య అమ్మవారి ఆలయ ప్రవేశం, 24వ తేదీన అష్టమి రోజున జాతర మహోత్సవం, 25న చిన్న తీర్థం నిర్వహించడానికి నిర్ణయించారు. కార్యక్రమంలో ఎండోమెంట్ ఈఓ పి.ప్రసాదరావు, సర్పంచ్ చిప్పాడ లక్ష్మి, గ్రామపెద్దలు అల్లు పద్మ, వాక అప్పారావు, వర్రి రమణ, నెక్కల రమణ, పలువురు గ్రామపెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు, సేవా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జామి ఎల్లారమ్మ జాతర ముహూర్తం ఖరారు


