గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
వేపాడ: 2026–27 విద్యాసంవత్సరంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఉమ్మడి విజయనగరం జిల్లా గురుకులాల సమన్వయ అధికారి ఎం.మాణిక్యం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఫిబ్రవరి 19 తుది గడువుగా పేర్కొన్నారు. దరఖాస్తు http://apbrfcet.a pcfrr.in వెబ్‌ఐట్‌లో చేసుకోవాలన్నారు. ఐదో తరగతి ప్రవేశ పరీక్ష మార్చి 1వ తేదీన ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్ష మార్చిఒకటిన మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు జరుగుతుందన్నారు. ఐఐటీ, నీట్ ప్రవేశపరీక్షకు ప్రత్యేక శిక్షణ కోసం అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు, ఆరు, ఏడో తరగతి ప్రవేశపరీక్ష మార్చి 2న ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు, 8, 9 తరగతుల ప్రవేశపరీక్ష అదేరోజు మధ్యాహ్నం జరుగుతుందన్నారు. ప్రవేశ రుసుం రూ.100తో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రవేశాలుంటాయని తెలిపారు.


