అంగన్‌వాడీ కేంద్రాలకు చేరిన బాలామృతం
విజయనగరం ఫోర్ట్: అంగన్‌వా డీ కేంద్రాల పరిధిలో ఉన్న 7 నెలలు నుంచి 3 ఏళ్లలోపు పిల్ల లకు అందించే బాలామృతం అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫ రా కాలేదనే అంశంపై ఈ నెల 8వ తేదీన ‘చిన్నారులకు అందని బాలామృతం’ అనే శీర్షికన ప్రచురించిన కథనానికి అధి కారులు స్పందించారు. అంగన్‌వాడీ కేంద్రాల కు బాలామృతం ప్యాకెట్లు సరఫరా చేశారు.
వంగర: మండలంలోని మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ గట్టుకు గండి పడింది. వంగర–రాజాం రోడ్డుపై కాలువ నీరు ప్రవహిస్తోంది. అధికారు లు స్పందించి కాలువకు పడిన గండిని పూడ్చి వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
వీరఘట్టం: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (జాక్టో) పోరుబాటకు పిలుపునిచ్చింది. వచ్చేనెల 5న ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ నిర్వహించి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రతి జిల్లా నుంచి 40 మంది చొప్పున ఉపాధ్యా యులు హాజరుకావాలని జాక్టో ప్రతినిధులు కోరారు. గురువారం పోస్టర్ విడుదల చేశారు. ఓపీఎస్‌ను, ఇన్‌సర్వీస్ వారికి టెట్ నుంచి మినహాయింపు డిమాండ్ సాధిద్దామన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలకు చేరిన బాలామృతం


