ఉసూరుమనిపిస్తున్నారు..!
ఈక్రాప్ నమోదులో అలసత్వం! ఆవేదనలో రైతాంగం సాగుకు సాయం అందడంలేదంటూ గగ్గోలు విత్తనం నుంచి పంట విక్రయం వరకు వీడని కష్టాలు
ఈ–క్రాప్ నమోదుకు చర్యలు
విజయనగరం ఫోర్ట్:
చంద్రబాబు ప్రభుత్వం రైతన్నపై వివక్షచూపుతోంది. సాగుకు సాయం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. ఇప్పటికే ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేసింది. మోంథా తుఫాన్ పంట నష్టపరిహారం అందించడంలో జాప్యం చేస్తోంది. రైతులకు అన్నివిధాలా ఉపయోగపడే ఈ క్రాప్ నమోదులోనూ కినుకవహిస్తోంది. రబీ సీజన్ ప్రారంభమై మూడునెలలు గడిచాయి. కొన్ని పంటలు చేతికొస్తున్నాయి. ఈ క్రాప్ నమోదు కాకపోవడంతో పంటలు అమ్ముకునేందుకు రైతులకు కష్టాలు తప్పడం లేదు. పంటల సాగులో అత్యంత కీలకమైన ఈ–క్రాప్ నమెదు పక్రియ నత్తనడకగా సాగడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా పథకం అమలుతో పాటు ఈ–క్రాప్ నమోదు, రైతు భరోసా పథక సాయం సకాలంలో అందేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు. రైతులను ఉద్ధ్దరిస్తామని చెప్పిన చంద్రబాబు ఉసూరుమనిస్తున్నారని, విత్తనాల నుంచి ఎరువులు అందించేవరకు అన్నింటా విఫలమయ్యారని విమర్శిస్తున్నారు.
●పంటల బీమా వర్తిస్తుంది
●పంట రుణాలు తీసుకోవచ్చు
●ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్ట పరిహారం అందుకోవచ్చు
●పండించిన పంటను విక్రయించుకోవచ్చు
జిల్లాలో రబీ సీజన్‌లో 1,26,895 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. మొక్కజొన్న 5,5837 ఎకరాల్లోనూ, పెసర 17,678 ఎకరాలు, మినుము 41,859 ఎకరాలు, వరి పంట 3,833 ఎకరాల్లో సాగయ్యాయి. ఈ మొత్తం విస్తీర్ణానికి ఈ–క్రాప్ నమోదు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం 23,215 ఎకరాలకు మాత్రమే ఈ క్రాప్ జరిగింది.
రబీలో 1,26,895 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇంతవరకు 23,215 ఎకరాల్లో ఈ–క్రాప్ నమోదు జరిగింది. 10, 15 రోజుల్లో పూర్తిస్థాయిలో ఈ–క్రాప్ నమోదు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.
– వి.తారకరామారావు,
జిల్లా వ్యవసాయ అధికారి
ఉసూరుమనిపిస్తున్నారు..!
ఉసూరుమనిపిస్తున్నారు..!


