మూడో విడత అన్నదాత సుఖీభవ ఏది బాబూ?
● సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు ● 2.27 లక్షల మందికి అన్నదాత సుఖీభవ అందాల్సి ఉంది ● కౌలు రైతులకు మొండిచేయి చూపిన చంద్రబాబు సర్కారు
విజయనగరం ఫోర్ట్:
అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ సా యం కింద ప్రతిరైతుకు ఏటా రూ.20 వేలు సాయం అందిస్తామని టీడీపీ నేతలు గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మా ట మార్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలు తో కలిపి రూ.20 వేలు ఇస్తామని మాట మార్చారు. అది కూడా సకాలంలో ఇస్తున్నారా అంటే లేదు. మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది కూడా రైతులకు సకాలంలో అన్నదాతసుఖీభవ సాయం అందలేదు. అన్నదాత సుఖీభవ పథకం కింద మూడోవిడత ఇవ్వాల్సిన రూ.4 వేలు సాయం ఇంతవరకు ఇవ్వలేదు. మరోవైపు కౌలు రైతులకు పథకం అందని ద్రాక్షగా మారింది. అన్నదాత సుఖీభవ సాయంలో కూడా లబ్ధిదారుల్లో భారీగా కోత విఽధించింది. వరి నూర్పులు, రబీ పంటలు సాగువేళ పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
లబ్ధిదారుల్లోనూ కోత...
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జిల్లాలోని 2.74 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకం కింద ఆర్థిక సాయం అందేది. చంద్రబాబు ప్రభుత్వం వివిధ కారణాలతో లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గించేసింది. అన్నదాత సుఖీభవ కింద 2.27 లక్షల మందికి మాత్రమే సాయం అందిస్తోంది. 47 వేల మంది రైతుల సంఖ్యను తగ్గించేసింది. మరోవైపు జిల్లాలో 13 ,635 మంది కౌలు రైతులకు పథకాన్ని దూరం చేసింది.
మూడో విడత అన్నదాత సుఖీభవ ఏది బాబూ?


