పేదలకు వైద్యం.. విద్యార్థులకు వైద్యవిద్య ఉచితంగా అందాల్
ప్రజా కోర్టులో దోషిగా నిలబెడదాం
మోసపూరిత హమీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజాకోర్టులో దోషిగా నిలబెడదాం. ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు. కూటమి నిర్ణయం ముమ్మాటీకి ప్రజావ్యతిరేక చర్య. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లాలో చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజల నుంచి చక్కని స్పందన లభించింది. జిల్లా కేంద్రంలో చేపట్టిన ర్యాలీకి భారీ సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల ప్రతాలను ఈనెల 18న రాష్ట్ర గవర్నరకు అందజేస్తాం.
– మజ్జి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,
విజయనగరం


