రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికలు
లక్కవరపుకోట: మండల కేంద్రంలో గల ఏపీ మోడల్ స్కూల్ మైదానంలో జిల్లా స్కూల్‌గేమ్స్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికలను మంగళవారం నిర్వహించారు. ఈ ఎంపికల్లో జిల్లాస్థాయి జట్టుకు అండర్ 14,17,19 విభాగాల్లో బాల,బాలికలను ఎంపిక చేశారు. జిల్లాలోని 17 పాఠశాలల నుంచి 173 మంది విద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఎంపికల్లో 30 మంది బాలికలను, 30 మంది బాలురును ఎంపిక చేసినట్లు చెప్పారు. వారు త్వరలో రాష్ట్రస్థాయిలో జరగబోయే పోటీల్లో విజయనగరం జిల్లా జట్లుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.కార్యక్రమంలో ఎంఈఓ సీహెచ్.కూర్మారావు, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి జి.లక్ష్మణరావు, చందులూరు పీడీ డాక్టర్ పి.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.


