ఇంటర్ యూనివర్సిటీ బేస్‌బాల్ పోటీలకు గరివిడి విద్యార్థ
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి ఎస్‌డీఎస్ కళాశాలకు చెందిన విద్యార్ధులు ఎం.అజయ్, ఎస్.ప్రవల్లికలు ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బేస్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఆంధ్రాయూనివర్సిటీలో ఈ నెల 15న జరిగిన బేస్‌బాల్ టీమ్ సెలక్షన్‌లో ఈ విద్యార్ధులు అర్హత సాధించారు. వచ్చే ఏడాది జనవరి 4 నుంచి 8 వరకు మహారాష్ట్రలోని పూణేలో జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బేస్‌బాల్ పోటీల్లో ఆంధ్ర యూనివర్సిటీ తరఫున ఈ విద్యార్థులు ప్రాతినిధ్యం వహిస్తారు. తమ కళాశాల విద్యార్థులు ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బేస్‌బాల్ పోటీలకు ఎంపిక కావడం పట్ల కరస్పాండెంట్ బి.రవి, ప్రిన్సిపాల్ డా.ఎ.రామకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్.సురేష్‌కుమార్, పీడీ ఎం.భానుమూర్తి విద్యార్థులను మంగళవారం అభినందించారు.


