వినతుల పరిష్కారంలో ఆలస్యం తగదు
● పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ రాంసుదర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ప్రజల నుంచి అందే వినతులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ఎస్.రాంసుందర్‌రెడ్డి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. వినతుల పరిష్కారంలో ఆలస్యం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటును జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి, డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీలాగాంధీ, బి.శాంతి, కళావతి తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి సమర్పించిన ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో మొత్తం 186 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులతో నేరుగా మాట్లాడిన తర్వాతనే ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని, మాట్లాడిన తేదీ, సమయాన్ని రిపోర్టులో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్వేశాఖ ఎ.డి ఆర్.విజయకుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవీప్రసాద్, సీపీఓ బాలాజీ, డీఈఓ యూ.మాణిక్యం నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల పరిష్కారంపై ఆడిట్ టీమ్‌కు శిక్షణ
ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై ఆడిట్ ఆధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రీ ఓపెన్ కేసులు, ఫ్రీ ఆడిట్, ఆడిట్, ప్రజల సంతృప్తి తదితర అంశాలు కచ్చితంగా ఉండేలా మరోసారి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించిన ఫిర్యాదులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న ధరఖాస్తులు, గడువు దాటినవి, రీ ఓపెన్ అయినవాటిపై వివరంగా సమీక్షించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్‌ఓ మురళి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆన్‌లైన్ ద్వారా మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 25 ఫిర్యాదులు
● ఏఎస్పీ చాంబర్‌లో కార్యక్రమం నిర్వహణ
విజయనగరం క్రైమ్: ప్రతి వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి ఈ వారం 25 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పీ సౌమ్యలత సోమవారం డీపీఓలోని తన చాబర్‌లో ఫిర్యాదులు స్వీకరించారు.ఈ మేరకు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించిన ఏఎస్పీ సౌమ్యలత వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత సిబ్బందితో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను వివరించారు. ఏఎస్పీ స్వీకరించిన ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించి 8, కుటుంబ కలహాలకు సంబంధించి 4, మోసాలకు పాల్పడినట్లు 3, ఇతర అంశాలకు సంబంధించి 10 ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో పరిష్కరించాలని ఏఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ కె. కుమారస్వామి, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు.
వినతుల పరిష్కారంలో ఆలస్యం తగదు


