కక్ష సాధింపులు తగవు
విజయనగరం టౌన్: తపాలా శాఖ యూనియన్‌లో ఉన్న నాయకులపై కక్ష సాధింపులను తక్షణమే నిలుపుదల చేయాలని ఆల్ ఇండియా పెన్షన్ ఎంప్లాయీస్ యూనియన్ గ్రూప్–సి రాష్ట్ర ఉపాధ్యక్ష్యుడు వి.రుద్రప్రతాప్ కోరారు. యూనియన్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కామ్రేడ్ ఎస్.ఎస్.మహదేవయ్యను డిపార్ట్‌మెంట్ విధుల నుంచి తొలగించడంపై తపాలాశాఖ కార్యాలయం ఆవరణలో బుధవారం నిరసన తెలిపారు. తపాలాశాఖలో ట్రేడ్ యూనియన్ హక్కులను పరిరక్షించాలన్నారు. యూనియన్‌ల గుర్తింపును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి.కిరణ్ కుమార్, ఎ.పెంటపాపయ్య, వి.శ్రీనివాసరావు, పతివాడ శ్రీనివాసరావు, కె.ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


