పాపం.. మన్యం బిడ్డలు!
ఆ గ్రామాలు..
రికార్డులకే పరిమితం
భౌతికంగా ఆ ఊళ్లు మనకు కనిపించవు.
ఇంకా చెప్పాలంటే ఆ గ్రామాలు ఉన్నట్లు
స్థానికులకే తెలియదు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
మన్యం బిడ్డలకు కష్టకాలం దాపురించింది. వారు చదుకునే పాఠశాలలు, హాస్టల్స్‌లో సదుపాయాల లేమి చావుల వరకు తీసుకెళ్తోంది. స్వచ్ఛమైన తాగునీరు లభించకపోవడం, ఆర్వోప్లాంట్లు మూలకు చేరడం, సరిపడినన్ని మరుగుదొడ్లు లేకపోవడం, పారిశుద్ధ్య లోపం, దోమల దాడి, సకాలంలో వైద్యసేలందించే సిబ్బంది హాస్టల్స్‌లో లేకపోవడం తదితర కారణాలు గిరిజన విద్యార్థులను ఆస్పత్రులపాల చేస్తున్నాయి. కొందరి ప్రాణాలు తీస్తున్నాయి. ఏడాదిన్నర కాలంలో పార్వతీపురం మన్యం జిల్లాలో 16 మంది విద్యార్థులు మృతిచెందడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే వసతిగృహాల్లోని గిరిజన బిడ్డల ప్రాణాలకు సైతం ఇప్పుడు భద్రత లేకపోవడంతో గిరిజనుల ఆగ్రహానికి కారణమైంది. గిరిజన మంత్రి సొంత జిల్లాలో ఇప్పటి వరకు 16 మంది గిరిజన బిడ్డలు ప్రాణాలు వదిలారు. చదువుకుంటారని హాస్టళ్లలో వేస్తె ఊపిరిపోతోందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని.. గిరిజన మంత్రిని నిలదీయడంతో సంధ్యారాణి వద్ద సమాధానం లేకపోయింది. దీంతో దీంతో ఉక్రోషం.. తరకంతో ఎదురుదాడి మొదలెట్టారు. నాకే జ్వరమొచ్చింది.. మనుషులన్నాక జ్వరం రాదా... నేను ఎవరికి చెప్పుకోవాలి.. ’ ఇదీ ఆమె ధోరణి. ప్రజల ఆరోగ్య భద్రత ప్రభుత్వం బాధ్యత.. అందుకే కదా ఆమెకు మంత్రిపదవి ఇచ్చింది.. లేకుంటే బుగ్గకారు వేసుకుని బదిలీలు.. కాంట్రాక్టులు ఇచ్చుకుంటూ కమీషన్లు నొక్కడానికి కాదుగా.. అనే విమర్శలు గిరిజన సంఘాలు, ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నా యి. తాజాగా సీతంపేట మండలం హడ్డుబంగి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న మండంగి కవిత విశాఖ కేజీహెచ్‌లో జ్వరం, ఊపిరితిత్తుల వ్యాధితో మృతి చెందడం.. మంత్రి అసమర్థతను మరో ఎత్తుకు తీసుకెళ్లింది. గత నెల రోజులుగా కురుపాం గురుకుల బాలికల పాఠశాల/కళాశాల బాలికలు ప్రాణా లు కాపాడుకునేందుకు ఎంతగా అల్లాడిపోయారో రాష్ట్రం మొత్తం చూసింది. అయినా అది తన బాధ్యత కాదు.. ఎవరికీ ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అంటూ సంధ్యారాణి చేసిన వ్యాఖ్యలు ఆమె అహంకారధోరణిని తేటతెల్లం చేస్తున్నాయని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి.
దురదృష్టమేనా..!
వెనుకబడిన పార్వతీపురం మన్యం జిల్లాకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి దక్కడం ఈ జిల్లా ప్రజల అదృష్టమో.. బాధ్యతలేని వారికి రెండు శాఖలు కట్టబెట్టడం దౌర్భాగ్యమో తెలియని పరిస్థితి నెలకొందని గిరిజన సంఘాల నాయకులు వాపోతున్నారు. సాలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మడి సంధ్యారాణి నియోజకవర్గంతో పాటు చుట్టూరా ఉన్న పార్వతీపురం.. కురుపాం... పాలకొండలో గిరిజన ప్రాంతాలే అధికం. పూర్తిగా వెనుకబడిన పల్లెలే. వర్షాకాలంలో వందలాది గ్రామాల ప్రజలు మలేరియా, టైఫాయిడ్.. నీళ్ల కాలుష్యం కారణంగా వచ్చే కామెర్ల వంటి వ్యాధులతో పోరాడుతుంటారు. సకాలంలో వైద్యసేవలు అందకపోవడం, పట్టించుకునే వారు లేకపోవడంతో భూమ్మీద నూకలున్నవారు బతికిపోగా లేనివారు సెలవు చెప్పి వెళ్లిపోవడం.. ఇదంతా మన ఖర్మ అనుకోవడం గ్రామస్తులకు పరిపాటిగా మారింది.
సమాధానం చెప్పాల్సిందే..
మృతదేహంతో ఆందోళన చేసినా
స్పందించని మంత్రి
మంత్రి తీరుపై గిరిజనుల ఆగ్రహం
సర్దిచెప్పిన సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్
పాపం.. మన్యం బిడ్డలు!


