జిల్లాకు తుఫాన్ ముప్పు
● మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదు
● ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలి
● కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్:
మొంథా తుఫాన్ కాకినాడ–విశాఖపట్నం మధ్య తీరందాటే అవకాశం ఉందని, దాని ప్రభావంతో జిల్లాలో గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. నష్టాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలటీ, విద్యుత్ శాఖలకు అధికారులకు శనివారం రెండు విడతలుగా నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సూచించారు.
ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర వేళ సహాయం కోసం కలెక్టరేట్ (08922–236947, 85238 76706), విజయనగరం ఆర్డీఓ కార్యాలయం–88858 93515, చీపురుపల్లి ఆర్డీఓ కార్యాలయం– 97049 95807, బొబ్బిలి ఆర్డీఓ కార్యాలయం–99893 69511, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్–98499 06486), ఏపీ ఈపీడీసీఎల్ –94906 10102, టోల్ ఫ్రీ నంబర్–1912లను సంప్రదించాలని సూచించారు.


