తమ వారి రాకకోసం...
పూసపాటిరేగ: విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి ఈ నెల 14న అర్ధరాత్రి సమయంతో దారి తప్పి బంగ్లాదేశ్ సముద్రజలాల్లో ప్రవేశించి అక్కడి కోస్టు గార్డులకు పట్టుబడిన విషయం తెలిసిందే. మత్స్యకారులను అక్కడి కోర్టులో హాజరుపరుస్తున్న ఫొటోలు పంపించడంతో బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. తమవారి రాకకోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. తమవారిని విడుదల చేసేందుకు రాష్ట్రప్రభుత్వం కృషిచేయాలంటూ మత్స్యకార సంఘాల నాయకులతో పాటు బాధిత కుటుంబాల సభ్యులు వేడుకుంటున్నారు. బంగ్లాదేశ్ పోలీసులకు పట్టుబడిన వారిలో పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన నక్క రమణ, వాసుపల్లి సీతయ్య, చింతపల్లికి చెందిన మైలపల్లి అప్పన్న, భోగాపురం మండలం కొండ్రాజుపాలెంకు చెందిన మరుపల్లి చిన అప్పన్న, మరుపల్లి రమేష్, సూరాడ అప్పలకొండ, మరుపల్లి ప్రవీణ్, సురపతి రాము, సురపతి చినఅపన్న ఉన్నారు. చిక్కిన బోటుతో పాటు, మత్స్యకారులను బందీలుగా అదుపులోకి తీసుకొన్నట్లు బంగ్లాదేశ్ పోలీసులు ఫొటోలు రిలీజ్ చేశారు.
మత్స్యకార కుటుంబాలు ఎదురుచూపు
బంగ్లాదేశ్ కోర్టులో మత్స్యకారులను
హాజరుపరుస్తున్నట్టు ఫొటోలు విడుదల
బాధిత కుటుంబాల్లో ఆందోళన
ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోలు
తమ వారి రాకకోసం...


