వేడుకగా కంచెమ్మ తల్లుల జాతర
● భక్తులతో పోటెత్తిన బోడికొండ
● అమ్మవారిని దర్శించుకున్న జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు,
మాజీ ఎంపీ బొత్సఝాన్సీ
మెరకముడిదాం: మండలంలోని కొండలావేరు సమీపంలోని బోడికొండపై వెలసిన కంచెమ్మతల్లుల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జాతర శనివారం వైభవంగా సాగింది. ఉదయం నుంచి అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7–30 గంటల మధ్యలో భక్తుల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సోమలింగాపురం గ్రామం నుంచి కంచెమ్మతల్లుల ఆలయం వరకు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. అమ్మవార్లను జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి దర్శించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కుబడులు చెల్లించారు. ఐదు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంలో పోలీసుల వైఫల్యంపై భక్తులు మండిపడ్డారు.
అప్రమత్తతే ప్రధానం
విజయనగరం క్రైమ్: మోంథా తుఫాన్ ముప్పు నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాఽథ్ జెట్టీ సూచించారు. తుఫాన్ అప్రమత్తతపై శనివారం ఐదు జిల్లాల ఎస్పీలతో సమీక్షించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వేడుకగా కంచెమ్మ తల్లుల జాతర
వేడుకగా కంచెమ్మ తల్లుల జాతర


