
బావిలో పడి వ్యక్తి ఆత్మహత్య
కొమరాడ: మండలంలోని విక్రంపురం గ్రామానికి చెందిన తూతిక స్వామేశ్వరరావు(60)ఆదివారం అర్ధరాత్రి దిగువ వీధిలో ఉన్న మంచి నీటి బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై కె.నీలకంఠం తెలిపారు. దీనిపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కిడ్నీ సంబంధిత వ్యాధి కారణంగా బాధపడుతున్న సోమేశ్వర రావుకు పార్వతీపురం జిల్లా అస్పత్రిలో డయాలసిస్ చేసినప్పటికీ నడుము నొప్పి ఎక్కువ ఉన్నందున బాధ తట్టులేక మానసికంగా కుంగిపోయి బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భర్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయనగరంలో యువకుడు..
విజయనగరం క్రైమ్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి కొండకరకాం గ్రామానికి చెందిన పి.గంగరాజు(20) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక అప్పులు చేసి, తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడని రూరల్ ఎస్సై అశోక్ తెలిపారు. మృతుని అన్నయ్య సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.