
ఫిర్యాదు దారులకు కారణాలు తెలియజేయాలి
● కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరంఫోర్ట్: ప్రతి వారం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి వచ్చే వినతులకు సంపూర్ణ న్యాయం చేయాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేవిధంగా అర్జీలకు పరిష్కారం చూపించాలని సూచించారు. కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 188 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌కు సంబంధించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తామని తెలిపారు. అసలైన ఫిర్యాదుదారులకు న్యాయం చేకూర్చేవిధంగా అధికారులు వ్యవహరించాలన్నారు. సమస్య పరిష్కరించలేని పక్షంలో దానికి కారణాలు అర్జీదారులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. వినతుల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి చూపాలని చెప్పారు. ఐటీ శాఖ వెబ్‌సైట్‌లో అన్ని శాఖలు వారివారి ముఖ్యమైన శాఖ మెమోలు, ప్రభుత్వ ఉత్తర్వుల కాపీలు వచ్చే గురువారంలోగా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.
ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో చర్యలు
విజయనగరం క్రైమ్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు నిర్వహించే ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదు దారుల నుంచి వినతులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి, సమస్యలను వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీ 28 ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు.

ఫిర్యాదు దారులకు కారణాలు తెలియజేయాలి