
వెయిట్ లిఫ్టింగ్‌లో అజేయుడు
బ్రాయిలర్
లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్
శ్రీ137 శ్రీ244 శ్రీ254
చికెన్
నెల్లిమర్ల రూరల్: వారిది నిరుపేద కుటుంబం. కుటుంబ పోషణకు వ్యవసాయ పనులు చేస్తూ వచ్చిన కొద్దిపాటి కూలి డబ్బులతో సర్దుకుపోయే దుస్థితి. గ్రామీణ సంప్రదాయబద్ధ క్రీడల పట్ల ఆసక్తి ఆయనను అంచెలంచెలుగా ఎదిగేలా చేసింది. పెద్దగా చదువుకోకపోయినప్పటికీ నమ్ముకున్న క్రీడ ప్రస్తుతం ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పదుల సంఖ్యలో పతకాలు సాధించి దేశ, రాష్ట్ర, జిల్లా కీర్తిని ఖండతరాల్లో ఇనుమడింపజేశారు. ఆయనే విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన సీనియర్ వెయిట్‌లిఫ్టర్ వల్లూరి శ్రీనివాసరావు. 1997లో శిక్షణ ప్రారంభించిన ఆయన పలు రాష్ట్రాల్లో జరిగిన చాంపియన్ షిప్ పోటీల్లో వరుస బంగారు పతకాలు కై వసం చేసుకున్నారు. ఇండియన్ ఆర్మీలో సిఫాయి స్థాయి నుంచి జేఏఓ కేడర్ వరకు ఎదిగి ప్రస్తుతం రిటైర్ అయ్యారు. గ్రామంలోనే ఉంటూ మరికొంత మంది క్రీడాకారులను తయారు చేస్తున్నారు. వల్లూరి శ్రీనివాసరావు పెద్ద కుమారుడు అజయ్ బాబు తండ్రి సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని తన 8వ ఏట నుంచే వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ ప్రారంభించాడు. 2021లో జాతీయస్థాయి చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని యూత్ విభాగంలో తొలి స్వర్ణం సాధించాడు. 2022 జూలైలో ఉజెబికిస్తాన్, 2022 అక్టోబర్‌లో బహ్రెయిన్, 2023లో యూపీ(ఇండియా), 2024 డిసెంబర్‌లో ఖతర్, ఉజెబికిస్తాన్, అదే ఏడాది సెప్టెంబర్‌లో ఫిజ్జి దేశాల్లో వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో సత్తా చాటాడు. ప్రస్తుతం పాటియాలాలోని ఓ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. తండ్రిని ఆదర్శంగా తీసుకున్న అజయ్‌బాబు వరుస విజయాలు సాధిస్తూ మరికొందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం
వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో రాణించేందుకు అజయ్ బాబు ప్రస్తుతం పాటియాలాలోని ఓ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. శిక్షణకు సంబంధించి అకాడమీ ఖర్చులు భరిస్తున్నప్పటికీ అదనంగా నెల కు రూ.40వేలు ఖర్చు అవుతున్నట్లు తండ్రి శ్రీని వాసరావు చెబుతున్నారు. గేమ్స్‌లో రాణించడమే తన కుమారుడి లక్ష్యమని లక్ష్య సాధనకు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ స్థాయికి వచ్చినట్లు తెలిపారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో రాణిస్తున్న అజయ్ బాబు ఆ కోటాలో ఇటీవల ఇండియన్ ఆర్మీలో జేఏఓ కేడర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మరో నె ల రోజుల్లో బాధ్యతలు కూడా స్వీకరించనున్నాడు.
స్కాట్‌లాండ్‌లో జరగనున్న పోటీలకు ఎంపిక
ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో జరిగిన కామన్‌వెల్త్ చాంపియన్‌షిప్ పోటీల్లో అజయ్‌బాబు స్వర్ణ పతకం సాధించడంతో 2026 జూలై 23 నుంచి స్కాట్‌లాండ్‌లో జరగనున్న అంతర్జాతీయ గేమ్స్‌కు అర్హత సాధించాడు. ఆ పోటీల్లో తన కుమారుడు తప్పనిసరిగా స్వర్ణం సాధిస్తాడడని తండ్రి శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.
తండ్రి బాటలో రాణిస్తున్న తనయుడు
కామన్‌వెల్త్ చాంపియన్ షిప్‌లో స్వర్ణం
స్కాట్‌లాండ్‌లో జరగనున్న గేమ్స్‌కు ఎంపిక
స్పోర్ట్స్ కోటాలో ఆర్మీలో ఉద్యోగం
ప్రతిష్టాత్మక గేమ్స్‌లో స్వర్ణంపైనే గురి

వెయిట్ లిఫ్టింగ్‌లో అజేయుడు

వెయిట్ లిఫ్టింగ్‌లో అజేయుడు