జిల్లా కేంద్రంలో గంజాయి కలకలం | - | Sakshi
Sakshi News home page

జిల్లా కేంద్రంలో గంజాయి కలకలం

Sep 2 2025 8:25 AM | Updated on Sep 2 2025 11:58 AM

జిల్లా కేంద్రంలో గంజాయి కలకలం

జిల్లా కేంద్రంలో గంజాయి కలకలం

 24 కేజీల గంజాయితో ఏడుగురి అరెస్ట్‌

పార్వతీపురం రూరల్‌: జిల్లా కేంద్రంలో సోమవారం ఒడిశా, ఉత్తర ప్రదేశ్‌లకు చెందిన ముఠానుంచి ఓ ప్రైవేట్‌ లాడ్జిలో 24కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్సై గోవింద తెలిపారు. ఒడిశాకు చెందిన రామ్‌ఖిల, రమేష్‌ కోరా, సంతోష్‌, ప్రశాంత్‌లు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆకాష్‌, వినయ్‌, ప్రతాప్‌లకు లాడ్జి వద్ద గంజాయిని అందజేస్తున్న క్రమంలో ఒక సూట్‌కేస్‌, మరో బ్యాగ్‌లో అప్పజెప్పేందుకు ఉంచిన గంజాయితో పాటు వారిని పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు వ్యక్తులతో పాటు వారు ఉపయోగించిన కారును, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

కామర్స్‌ అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

సాలూరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్‌ అధ్యాపక పోస్టును భర్తీ చేయడానికి గెస్ట్‌ లెక్చరర్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డా.కె.ఉషశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. పీజీ అర్హత కలిగి ఉండాలని, నెట్‌,సెట్‌, పీహెచ్‌డీ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల10న కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

జిల్లా స్థాయి భజన పోటీలు రేపు

పాలకొండ: పట్టణంలోని ఏలాం సెంటర్‌లో ఏర్పాటు చేసిన వినాయ మంటపం వద్ద బుధవారం జిల్లా స్థాయి భజన పోటీలు నిర్వహిస్తామని నిర్వహకులు తెలిపారు. పోటీలో గెలుపొందిన భజన బృందాలకు మొదటి బహుమతిగా రూ.6వేలు, రెండవ బహుమతి రూ.5వేలు, మూడవ బహుమతి రూ.4 వేలు అందిస్తామని వివరించారు. అలాగే బెస్ట్‌ సింగర్‌, బెస్ట్‌ డోలక్‌, బెస్ట్‌ హర్మోనిస్టులను ఎంపిక చేసి బహుమతులు అందిస్తామన్నారు. ఆసక్తి ఉన్న భజన బృందాలు నేరుగా తమ కమిటీ సభ్యులను సంప్రదించాలని సూచించారు.

ఆగి ఉన్న లారీని ఢీ కొన్న ఆటో

బొండపల్లి: మండలంలోని చందక పేట గ్రామానికి సమీపంలో జాతీయ రహదారి 26పై ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న ఆటో ఢీ కొనడంతో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం వేకువ జామున జరి గిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలి లా ఉన్నాయి. విజయనగరం నుంచి గజపతినగరం వైపు మిరపకాయలు లోడుతో వెళ్తున్న ఆటో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బలంగా ఢీ కొట్టడంతో శ్రీకాకుళానికి చెందిన డ్రైవర్‌ చంద్రరావుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్‌ను జిల్లా కేంద్ర సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నలుగురు జూదరుల అరెస్టు

లక్కవరపుకోట: మండలంలోని సంతపేట గ్రామం సమీపంలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై ఎస్సై నవీన్‌పడాల్‌ నేతృత్వంలో పోలీసులు సోమవారం దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.18,860 నగదు, రెండు జతల పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement