
అదును దాటుతున్నా.. అందని ఎరువు!
● బొండపల్లి మండలంలో 16 రైతు సేవా కేంద్రాలు ( రైతు భరోసా కేంద్రాలు) ఉన్నాయి. ఇందులో ఐదు రైతు సేవా కేంద్రాలకు ఎరువులు వచ్చాయి. మిగిలిన 11 ఆర్‌ఎస్‌కేలకు ఎరువులు సరఫరా కాలేదు.
● దత్తిరాజేరు మండలంలో 17 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఆరు కేంద్రాలకే ఎరువులు సరఫరా అయ్యాయి. మిగిలిన కేంద్రాలకు సరఫరాకాలేదు. రైతులు ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి.
● వంగర మండలంలో రైతు సేవా కేంద్రాలకు ఇంకా ఎరువులు చేకపోగా ప్రైవేటు డీలర్ల వద్ద మాత్రం దొరుకుతున్నాయి.
● మెంటాడ మండలంలో 19 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. ఏ రైతు సేవా కేంద్రానికి కూడా ఎరువులు రాలేదు.