
నగర శివార్లలో డ్రోన్లతో నిఘా
విజయనగరం క్రైమ్: నేరాల నియంత్రణలో భాగంగా నగర శివారుల్లో డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. ఇటీవల జరిగిన నేర సమీక్షలో ఎస్పీ ఆదేశాల మేరకు విజయనగరం రూరల్ పోలీసులు ఈ చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ మేరకు సున్నితమైన, మారుమూల ప్రదేశాలైన జమ్ము, నారాయణపురం, పడాలపేట, వైఎస్సార్ నగర్, ఫోర్ట్ సిటీ స్కూల్ వెనక ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘాకు చర్యలు తీసుకున్నామని రూరల్ సీఐ లక్ష్మణరావు తెలిపారు. ప్రతిరోజూ ఈ డ్రోన్ల ద్వారా నిఘా ఉంటుందని, అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని, తద్వారా నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు.