
సమస్యల పరిష్కారానికే పోలీసు వెల్ఫేర్‌డే
పార్వతీపురం రూరల్: శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ పోలీస్ వెల్ఫేర్‌డే(గ్రీవెన్స్ డే) నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సిబ్బంది నుంచి విజ్ఞాపనలు స్వీకరించి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కార చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి అలాగే వృత్తి పరమైన, ఆరోగ్యపరమైన, వ్యక్తిగతమైన సమస్యలను పరిష్కరిం చడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా శాఖాపరమైన సిబ్బంది సమస్యలను తెలుసుకు ని పరిశీలించి సత్వర పరిష్కారానికి అవకాశం ఉన్న అంశాలపై ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, డీసీఆర్‌బీ సీఐ ఆదాం, సీసీ సంతోష్ కుమార్, ఆర్‌ఐ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి