విద్యార్థుల నిరీక్షణ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల నిరీక్షణ

Jul 11 2025 5:37 AM | Updated on Jul 11 2025 5:37 AM

విద్యార్థుల నిరీక్షణ

విద్యార్థుల నిరీక్షణ

చికెన్‌
బ్రాయిలర్‌ లైవ్‌ డెస్‌డ్‌ స్కిన్‌లెస్‌ శ్రీ95 శ్రీ160 శ్రీ170

షెడ్యూల్‌ ప్రకటించాలి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులు చేరేందుకు ప్రభుత్వం తక్షణమే షెడ్యూల్‌ విడుదల చేయాలి. ప్రభుత్వ కళాశాలల్లో షెడ్యూల్‌ విడుదల చేయకపోవడంవల్ల ప్రైవేట్‌ కళాశాలలు దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియ చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రభుత్వ కళాశాలలకు తీవ్రనష్టం జరుగుతుంది. ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాం. – సింహాద్రి కిరణ్‌కుమార్‌,

ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

పార్వతీపురం టౌన్‌: డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇంటర్‌మీడియట్‌ పరీక్షా ఫలితాలు వెలువడి రెండు నెలలు గుడుస్తున్నా డిగ్రీలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేయకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక విద్యార్థులు తమ సమీపంలో గల కళాశాలల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరికకు కౌన్సెలింగ్‌ మొదలైతే ఆ ప్రభావం సాధారణ డిగ్రీ కోర్సులు నిర్వహిస్తున్న కళాశాలపై పడుతుందని కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు ప్రభుత్వ, 8 ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి. వాటిలో ప్రవేశానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యార్థుల భవితను ఆలోచించి 2020–21 విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఫలితంగా విద్యార్థుల ప్రవేశాలకు మార్గం సుగమం చేసింది. గతంలో ప్రభుత్వ కళాశాలల్లో సీట్ల కోసం విద్యార్థులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఆన్‌లైన్‌ విధానాన్ని తిరిగి అమలు చేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. డిగ్రీలో ఆన్‌లైన్‌ ప్రవేశాల కారణంగా విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ప్రవేశాలు పొందేవారు. విద్యార్థికి దగ్గరలో, ఇష్టమైన కళాశాల ఎంపిక సులభతరంగా ఉండేది.

సబ్జెక్టులపై తర్జన, భర్జన

డిగ్రీలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్‌ సబ్జెక్టు విధానాన్ని డబుల్‌ సబ్జెక్టుకు మార్చాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తర్జన, భబర్జనలు కొనసాగుతున్నాయి. డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల్లో దేన్ని అనుసరించాలనే అంశంపై ఉన్నత విద్యాశాఖాధికారులు సరైన నిర్ణయానికి రాలేదు. జిల్లాలో 12680 మంది ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్లో కొంతమంది డిగ్రీ ప్రవేశాలపై మొగ్గు చూపుతున్నారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా ప్రవేశ పరీక్షల్లో ఆశించిన ర్యాంకులు రాని విద్యార్థులు సాధారణ డిగ్రీ కోర్సుల వైపు మొగ్గుచూపుతుంటారు. జూలై మొదటి, రెండవ వారంలో ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల కాకపోతే విద్యార్థుల్లో పలువురు ఇంజినీరింగ్‌ లేదా ఫార్మా కోర్సుల్లో చేరే అవకాశాలున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. ఇంటర్‌ ఫలితాలు వెలువడిన వెంటనే డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తే కళాశాలల్లో ఎక్కువ భర్తీ అయ్యే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

డిగ్రీ ప్రవేశాలపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం

రెండు నెలలుగా ఎదురుచూపులు

నోటిఫికేషన్‌ జారీ చేయని ఉన్నత

విద్యాశాఖ

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌పై లేని స్పష్టత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement