
కారులో 300 లీటర్ల సారా స్వాధీనం
గుమ్మలక్ష్మీపురం(కురుపాం)/జియ్యమ్మవలస: కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని జియ్యమ్మవలస మండలం దాసరిపేట గ్రామ సమీపంలో సారా రవాణాపై రూట్ వాచ్ చేస్తుండగా ఓ కారులో తరలిస్తున్న 300 లీటర్ల సారాను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈమేరకు తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒడిశాలోని సందుబడి గ్రామంలో తయారైన సారాను 15 క్యాన్లతో (300 లీటర్లు) టాటా ఇండికా కారులో పాలకొండ మండలం చినమంగళాపురం గ్రామానికి చెందిన వడ్డాది సురేష్, జియ్యమ్మవలస మండలం చినమేరంగికి చెందిన బొత్స అనిల్‌లు తరలిస్తుండగా పట్టుబడ్డారని చెప్పారు. సారాతో పాటు కారును కూడా స్వాధీనం చేసుకుని పట్టుబడిన ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సమావేశంలో ఆయన వెంట సబ్ ఇన్‌స్పెక్టర్ జె.రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు.