
భరతనాట్యంలో కొత్తవలస విద్యార్థినుల ప్రతిభ
కొత్తవలస: మండల కేంద్రంలోని శివశక్తి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అకాడమికీ చెందిన జి.తపస్వి, కె.ధన్విక, జి.ఊర్వజ ఈ నెల 5న తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాలో నటరాజ నర్తనయజ్ఞంలో భాగంగా నిర్వహించిన భరతనాట్యం ప్రదర్శనలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రదర్శనలో మూడు వేల మంది విద్యార్థులు 27 నిమిషాల 31 సెకెన్ల పాటు నృత్యం చేసి ప్రపంచ రికార్డు నమోదు చేశారని మాస్టర్ కేఏ రాజు తెలిపారు. విద్యార్థినులు పలువురు అభినందించారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత
జామి: మండలంలోని భీమసింగి వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యంను విజిలెన్స్, సీఎస్‌డీటీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. వాకచర్ల నరేష్ అనే వ్యక్తి మీసాల నాయుడు ఆటోలో బియ్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. అధికారులు ఆటో సీజ్ చేసి 856 కిలోల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నరేష్, నాయుడులపై కేసు నమోదు చేసి, బియ్యంను భీమసింగి –1 డిపోకు అప్పటించారు. కార్యక్రమంలో సీఎస్‌డీటీ వీవీఎస్ మూర్తి, విజిలెన్స్ సీఐ బి.సింహాచలం, హెచ్‌సీలు పురుషోత్తం, కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

భరతనాట్యంలో కొత్తవలస విద్యార్థినుల ప్రతిభ