
సానుకూలంగా స్పందించండి
తక్షణమే చర్యలు తీసుకోవాలి..
పార్వతీపురం రూరల్: అర్జీదారులు తెలియజేసిన సమస్యల్లో వాస్తవం ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో వివిధ సమస్యలపై వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చిన అర్జీలను తానే స్వయంగా పరిశీలించిన అనంతరం సంబంధించిన స్టేషన్ అధికారులకు సిఫార్సు చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కువగా కుటుంబ కలహాలు, భూ, ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీల వసూళ్లు, ప్రేమ పేరుతో మోసాలపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. మొత్తం 16 వినతులు స్వీకరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ ఆదాం, తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం క్రైమ్: అర్జీదారులు తెలియజేసిన సమస్యలపై సానుకూలంగా వ్యవహరించాలని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్మం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తెలియజేసిన సమస్యలను సానుకూలంగా విన్నారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 40 ఫిర్యాదులు స్వీకరించగా.. ఇందులో భూ తగాదాలకు సంబంధించినవి 13.. కుటుంబ కలహాలకు సంబంధించినవి 4.. మోసాలకు పాల్పడినవి 5.. ఇతర అంశాలకు సంబంధించినవి 18 ఫిర్యాదులున్నాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, డీసీఆర్‌బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ వకుల్ జిందల్
పీజీఆర్‌ఎస్‌లో 40 వినతుల స్వీకరణ

సానుకూలంగా స్పందించండి