
మడ్డువలస నీరు విడుదల
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ ద్వారా ఖరీఫ్ పంటల సేద్యానికి రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ సోమవారం సాగునీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఆవరణలో ఉన్న కుడి ప్రధాన కాలువ హెడ్ స్లూయీస్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్విచ్ ఆన్ చేసి సాగునీటిని విడిచిపెట్టారు. తొలి రోజు 100 క్యూసెక్కుల నీటిని వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయకట్టు పరిధిలో ప్రతి ఎకరాకూ సాగునీటిని అందేలా చర్యలు తీసుకోవాలని ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బొత్స వాసుదేవరావునాయుడు, పిన్నింటి మోహనరావు, పైల వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.