పీఏసీఎస్‌లకు అనధికారిక పీఐసీ కమిటీలు | - | Sakshi
Sakshi News home page

పీఏసీఎస్‌లకు అనధికారిక పీఐసీ కమిటీలు

Jul 9 2025 6:21 AM | Updated on Jul 9 2025 6:21 AM

పీఏసీఎస్‌లకు అనధికారిక పీఐసీ కమిటీలు

పీఏసీఎస్‌లకు అనధికారిక పీఐసీ కమిటీలు

విజయనగరం అర్బన్‌: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌)లకు ఇంతవరకు ఉన్న అధికారిక పీఐసీ (పర్సనల్‌ ఇన్‌చార్జ్‌ కమిటీ)ల స్థానంలో అనధికారిక పీఐసీ కమిటీలను నియమిస్తూ వ్యవసాయ సహకార శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలు జూలై 30, 2025 వరకు, లేదంటే ఎన్నికలు నిర్వహించేవరకు వర్తించనున్నాయని తెలిపింది. చైర్‌పర్సన్‌, ఇద్దరు పర్సన్‌ సభ్యులతో కమిటీని ప్రకటించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 94 పీఏసీఎస్‌లు ఉన్నప్పటికీ 19 పీఏసీఎస్‌లకు మాత్రమే కమిటీలను ప్రకటించారు. విజయనగరం జిల్లాలో 12 పీఏసీఎస్‌లలో గజపతినగరం, సంతకవిటి, సంకిలి, బొబ్బిలి, కారాడ, కోమటిపల్లి, పాల్తేరు, నందిగాం, కొత్తరేగ, రామభద్రపురం, మెంటాడ, జక్కువ, పార్వతీపురం మన్యం జిల్లాలో 7 పీఏసీఎస్‌లలో బీజేపురం, కొమరాడ, శివిని, కురుపాం, శివరాంపురం, పెదపదం, ఎం.మామిడిపల్లి ఉన్నాయి.

మత్తుపదార్థాలు విక్రయిస్తే చర్యలు

విజయనగరం క్రైమ్‌: విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు, ఖైనీలు, ఇతర మత్తుపదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సీ వకుల్‌ జిందల్‌ హెచ్చరించారు. ‘ఆపరేషన్‌ సేఫ్‌ క్యాంపస్‌ జోన్‌’ పేరుతో పలు విద్యాసంస్థల సమీపంలోని పాన్‌ షాపులు, కిరాణ షాపుల్లో మంగళవారం తనిఖీలు జరిపారు. వ్యాపారులు విజ్ఞతతో వ్యవహరించాలని, విద్యార్థుల భవిష్యత్తును నాశనంచేసే విక్రయాలకు స్వస్తి పలకాలన్నారు. ఆకస్మిక తనిఖీల్లో విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, వన్‌ టౌన్‌ సీఐ ఎస్‌.శ్రీనివాస్‌, ఎస్బీ సీఐలు ఎ.వి.లీలారావు, ఆర్‌.వి.ఆర్‌.కె.చౌదరి, ఎస్‌ఐలు ప్రసన్నకుమార్‌, రామగ

ణేష్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు పాల్గొన్నారు.

● జీఓ విడుదల చేసిన వ్యవసాయ సహకార శాఖ

విజయనగరంలో ‘ఆపరేషన్‌ సేఫ్‌ క్యాంపస్‌ జోన్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement