
ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.300 కోట్లు
రామభద్రపురం: జిల్లాలో ఈ ఖరీఫ్‌లో సహకార బ్యాంకుల ద్వారా రైతులకు సుమారు రూ.300 కోట్లు వ్యవపాయ రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. ఈ మేరకు రామభద్రపురంలోని డీసీసీబీ బ్రాంచ్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని రైతులకు ఇప్పటి వరకు రూ.80 కోట్లు వ్యవసాయ రుణాలు అందజేశామన్నారు.జిల్లా సహకార బ్యాంకు ద్వారా రూ.2000 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని,ఇందులో రూ.1700 కోట్ల వరకు ఆప్కాబ్‌లో అప్పుతేగా రూ.300 కోట్లు బ్యాంకువని చెప్పారు. వినియోగదారులకు సేవందించడంలోను, డిపాజిట్స్ పెంచడంలోనూ ఎస్‌బీఐ, ఏపీజీవీవీ యూనియన్ బ్యాంకులతో పోటీ పడేలా ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అలాగే జిల్లాలో ఉన్న 24 సహకార సంఘాలను మోడరైజేషన్ చేస్తున్నామన్నారు. త్వరలో సహకార సంఘాలకు యూరియా సరఫరా అవుతుందని, ఈ ఏడాది రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ జి.చంద్రమోహననాయుడు తదితరులు పాల్గొన్నారు.
డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున