
ఒక్కో బెడ్‌పై ఇద్దరు రోగులకు వైద్యం
● గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో తప్పని అవస్థలు
● జ్వరాల వ్యాప్తితో ఆస్పత్రికి రోగుల తాకిడి
గజపతినగరం రూరల్:
గతంలో ఎన్నడూ చూడని విధంగా జిల్లాలో జ్వరాలు వ్యాప్తిచెందుతున్నాయి. ఆస్పత్రులకు జ్వరపీడితుల తాకిడి పెరిగింది. ఓపీ పెద్ద సంఖ్యలో నమోదవుతోంది. ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రుల్లో బెడ్‌లు చాలడం లేదు. ఒక్కో బెడ్‌పై ఇద్దరుముగ్గురికి వైద్యసేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో సేవల తీరే నిలువెత్తు సాక్ష్యం. ఇక్కడ బెడ్‌లు 56 ఉండగా ఇన్‌పేషెంట్లు 79 మంది ఉన్నారు. చేసేదిలేక ఒక్కో బెడ్‌పై ఇద్దరిని ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు.
అందుబాటులోకి రాని భవనం
గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి మెంటాడ, దత్తిరాజేరు, బొండపల్లి, గజపతినగరం మండలాల్లోని 120 గ్రామాల ప్రజల వైద్యసేవలకు ఆధారం. దీని ప్రాధాన్యతను గుర్తించిన గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 100 పడకలకు స్థాయి పెంచుతూ రూ.17కోట్లు మంజూరు చేసింది. భవన నిర్మాణాన్ని సుమారు 85 శాతం మేర పూర్తి చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఆస్పత్రి మిగులు పనులపై శ్రద్ధచూపలేదు. ఫలితం రోగులకు వైద్యకష్టాలు తప్పడంలేదు. వరండాల్లోను, ఒక్కో బెడ్‌పై ఇద్దరు చొప్పున ఉంటూ వైద్యసేవలు పొందాల్సి వస్తోంది. ఇదే విషయాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి జీవనరాణి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా వంద పడకల ఆస్పత్రి అందుబాటులోకి వచ్చేవరకు రోగులకు ఇబ్బందులు తప్పవన్నారు.

ఒక్కో బెడ్‌పై ఇద్దరు రోగులకు వైద్యం

ఒక్కో బెడ్‌పై ఇద్దరు రోగులకు వైద్యం

ఒక్కో బెడ్‌పై ఇద్దరు రోగులకు వైద్యం

ఒక్కో బెడ్‌పై ఇద్దరు రోగులకు వైద్యం