మూడు లాంతర్లు నుంచి ఎంజీ రోడ్డు
మీదుగా కార్మికుల ర్యాలీ
విజయనగరం గంటస్తంభం:
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక, కర్షక, ఉద్యోగ వర్గాలు కదంతొక్కాయి. నిరసన గళం వినిపించాయి. లేబర్ కోడ్‌లు రద్దుచేయాలంటూ నినదించాయి. భారీ ర్యాలీలు, మానవహారాలు నిర్వహించాయి. విధులు బహిష్కరించి దేవ్యాప్త సార్వత్రిక సమ్మెలో బుధవారం భాగస్వాములయ్యాయి. సమ్మెను విజయవంతం చేయడంలో వివిధ రంగాలకు చెందిన కార్మికులు, చిరుద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక, రైతు, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం బ్యాంకింగ్, కోల్, రైల్వే, పోస్టల్, స్టీల్, బీమా వంటి కీలక రంగాల్లో ప్రైవేటీకరణను ప్రోత్సహించడం విచారకరమన్నారు. ఇది భవిష్యత్‌లో నిరుద్యోగితను పెంచుతుందని, ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మికులకు కనీస దినసరి కూలీ రూ.670గా ఉండాల్సిందేనని ఆర్థికవేత్తల నివేదికలు తేల్చి చెప్పగా.. వాటన్నింటినీ కాదని కనీస వేతనం రూ.178గా నిర్ధారిస్తూ పార్లమెంటులోని పెద్దలందరూ చప్పట్లు కొట్టి చట్టం చేయడం విచారకరమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్మి సుబ్బారావమ్మ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎ.జగన్మోహన్ రావు, సీపీఎం నగర కార్యదర్మి రెడ్డి శంకరరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్మి బుగత అశోక్, జిల్లా రైతు సంఘం కార్మదర్మి బి.రాంబాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్మి వర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య, అంగన్‌వాడీ ఉద్యోగులు, ఆశ కార్యకర్తలు, చిరుద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కదంతొక్కిన కార్మిక, కర్షకలోకం
కదంతొక్కిన కార్మిక, కర్షకలోకం