
డిపార్ట్‌మెంట్ ఆప్షన్ లేకుండా బదిలీలా?
బొబ్బిలి: మాకు అన్యాయంగా బదిలీలు, డిప్యుటేషన్‌లు చేస్తున్నారు. కనీసం డిపార్ట్‌మెంట్ ఆప్షన్‌లేకుండా సీనియారిటీ లిస్ట్, ప్రమోషన్ చానల్, పేస్కేల్ లేకుండా రేషనలైజేషన్, ట్రాన్స్‌ఫర్‌లు చేయడంతో ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని సచివాలయ మహిళా పోలీసులు హోం మంత్రి వంగలపూడి అనితను కలిసి ఆవేదన వెళ్లగక్కారు. బొబ్బిలి కోటలో అనితకు వినతి పత్రం అందజేశారు. చాలా మంది చంటి పిల్లలు, పేదరికం వంటి కారణాలతో బదిలీ స్థానాలకు వెళ్లలేక ఉద్యోగాలు వదిలేందుకు సిద్ధమవుతున్నారన్నారు. బదిలీ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కోరారు. సమస్యపై మంత్రి పరిశీలిస్తామన్నారే తప్ప స్పష్టత ఇవ్వలేదంటూ పలువురు వాపోయారు.
● పట్టణంలోని 17వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో హోం మంత్రి పాల్గొన్నారు. ముందుగా ఎంపిక చేసిన ఇళ్లకు వెళ్లి కార్యక్రమాన్ని మమ అనిపించారు.
హోం మంత్రి వద్ద ఆవేదన
వెళ్లగక్కిన మహిళా పోలీసులు