
14న ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిస్ మేళా
విజయనగరం అర్బన్: ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా (పీఎంఎన్‌ఏఎం)ను ఐటీఐ విద్యార్థులకు ఈ నెల 14న స్థానిక ఐటీఐ ప్రాంగణంలో నిర్వహిస్తామని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, అప్రెంటిస్ అడ్వైజర్ వీవీగిరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీఐలో ఉత్తీర్ణులైన అఽభ్యర్థులకు అప్రెంటిస్ ఇవ్వడానికి ఈస్ట్‌కోస్ట్ రైల్వేతోపాటు ప్రైవేట్ రంగానికి చెందిన జయభేరి ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, భగవతి ప్రొడక్ట్‌స్ ప్రైవేట్ లిమిటెడ్, క్యూసివ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, సాంసంగ్ ఆథరైజ్ సర్వీస్, నవదీప్ ఎలక్ట్రానిక్స్, బోల్టాస్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్, ఐఎఫ్‌బీ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్, విజయనగర్ బయోటెక్ తదితర ప్రముఖ కంపెనీలు ఎంపిక చేస్తాయని తెలిపారు. ఎంపికై న వారికి ఆయా పరిశ్రమల్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తగిన స్టైపెండ్ చెల్లించనున్నట్లు జిల్లా కన్వీనర్ తెలియజేశారు. ఆసక్తిగల అఽభ్యర్థులు బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్, రెండు ఫొటోస్‌తో పాటు హాజరు కావాలని ప్రిన్సిపాల్ తెలియజేశారు. పూర్తి వివరాల కోసం పోన్ 9441518355, 9849944654 నంబర్లను సంప్రదించవలసిందిగా కోరారు. పేర్లను నమోదు చేసుకోవడానికి సంబంధించిన క్యూఆర్ కోడ్‌ను విడుదల చేశారు.