
యువకుడి అదృశ్యం
రామభద్రపురం: మండలంలోని కోటవిర్లాం గ్రామానికి చెందిన బప్పడాల ప్రభాకర్(34) అనే యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై వి. ప్రసాదరావు తెలిపారు. ఆ యువకుడు మతిస్థిమితిం లేక ఎటో వెళ్లిపోతుండడం, మళ్లీ తిరిగి ఇంటికి వస్తుండడం చేస్తుంటాడు.గత నెల 25 వ తేదీన మధ్యాహ్నం ఇల్లు విడిచి వెళ్లిపోయాడు.కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాల్లో ఉన్న బంధువులకు ఫోన్‌లు చేసి వాకబు చేశారు. ఆదివారం వరకు ఇంటికి రాకపోవడంతో అతడి భార్య కుమారి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభాకర్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.