
బళ్ల కృష్ణాపురం కేసు దర్యాప్తు వేగవంతం
సీతానగరం: మండలంలోని బళ్లకృష్ణాపురం గ్రామంలో అనుమానాస్పదంగా మృతి చెందిన బొత్స రమణమ్మ కేసుపై వచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యామని పార్వతీపురం సీఐ గోవిందరావు అన్నారు. మండలంలో ఆదివారం రాత్రి బళ్లకృష్ణాపురం గ్రామానికి చెందిన బొత్స రమణమ్మ(78)ను ఆమె ఇంట్లోని బీరువాలో నగదు, బంగారం చోరీ చేయడానికి హత్యచేసి ఉంటారని అనుమానం ఉందని కుమార్తె లక్ష్మి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై స్థానిక పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సీఐ ఎస్.గోవిందరావు మాట్లాడుతూ ఉన్నతాధికారుల సూచనల మేరకు నేరానికి పాల్పడిన వారిని గుర్తించడానికి ఇన్‌చార్జి ఎస్సై నీలకంఠం, బలిజిపేట ఎస్సై సింహాచలంతో కలిసి చర్యలు తీసుకుంటున్నామని.ఇప్పటికే క్లూస్ టీమ్ సహకారంతో నిందితులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఏఎస్సై ఎల్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.